వార్తలు (News)

కరోనా ఆస్పత్రి ప్రమాదానికి గురైన ప్రత్యక్ష సాక్షి కథనం

ముంబయి షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగడంతో అందులో కొవిడ్‌ ఆసుపత్రికి కూడా మంటలు అంటుకుని 10 మంది మృతో చెందిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ఈ ఘటనలో పలువురు గాయపడగా మరికొందరు క్షేమంగా బయటపడ్డారు. అలా బయటపడిన మాధురి గోద్వానీ(67) అనే వృద్ధురాలు ఆసుపత్రిలో ఆమె అనుభవించిన దయనీయ పరిస్థితిని వివరిస్తూ ‘నా భర్త చేతన్‌ గోద్వానీ(78)కి కరోనా సోకడంతో ఆయనను కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించి ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారు.

శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మేము ఉన్న గదిలోకి పొగ వ్యాపించిన సమయంలో ఒక వార్డు బాయ్‌ హడావిడిగా వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని సూచించి వెంటనే వెళ్లిపోయాడు. ఈలోపే గది నిండా పొగ చేరిపోగా సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు. ‘ఇద్దరు వృద్ధులను బయటకు తరలిస్తున్న ఓ మహిళ కనిపించింది. ఇక చేసేదేం లేక నా భర్తను శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు తీసుకెళ్లాల్సి వచ్చింది’ ఆ సమయంలో లిఫ్ట్‌ పనిచేస్తోంది. మొదటి అంతస్తు వరకు లిఫ్ట్‌లోనే వెళ్లి అక్కడి నుంచి మెట్ల గుండా కిందకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాం అని ఆ రాత్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.