జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

పిఎం ఆవాస్ యోజన అంతా మాయ….

కొద్దీ రోజుల క్రితం ఒక పత్రిక ప్రకటనలో ఒక మహిళ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా నాకు ఒక నీడ లభించింది. నాకే కాదు ఈ పథకం కింద నాలాంటి మరొక 24,00,000 మందికి ఇల్లు లభించడం ద్వారా మేము స్వీయ ఆధారులమయ్యాము అని ఆ పత్రిక ప్రకటనలో పేర్కొంది.

Image Credit NewsLaundry

ఇప్పుడు అదే మహిళ దగ్గరకి వెళ్లి నిజానిజాలు విచారించగా ఆమె అసలు నాకు ఇల్లే లేదని, ఆమె ఉండేది పూరి గుడిసెలో అని, రూ.500 అద్దె చెల్లించి ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, అసలు ఆ ఫోటో ఎప్పుడు తీశారో కూడా తనకు తెలియదనీ వివరించింది.

Video Credit News Laundry
Image Credit News Laundryhttps://www.newslaundry.com/2021/03/20/woman-pics-in-the-advertisement-of-pradhan-mantri-awas-yojana-lives-in-a-rented-room-of-500-rupees

ఆ ప్రకటన వెలువడిన మరుసటి రోజు ఉదయం చుట్టూ పక్కల ఉండే ఇళ్ల వాళ్ళు వచ్చి నీ ఫోటో పేపర్ లో పడిందని చెప్పేవరకు ఆమె ఏమి ఎరుగనని చెప్పారు. ఆ ఫోటో ఎప్పుడు తీశారో మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆమె నేను పని చేయడానికి బాబూ ఘాట్ ఒక 10 రోజులు వెళ్లానని బహుశా ఆ ఫోటో అప్పుడే తీసి ఉంటారని, ఆ ప్రకటనలో ఉన్నది అంతా అబద్ధం అని ఆ విలేఖరితో చెప్పారు.

PM AAVAAS Yojna Reality
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.