క్రైమ్ (Crime) వార్తలు (News)

కుల్‌దీప్‌ పజ్జా ఎన్‌కౌంటర్‌…

గోగా గ్యాంగ్‌కు పేరుమోసిన నేరగాడు కుల్‌దీప్‌ పజ్జాను పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే కుల్‌దీప్‌ హతం అయ్యారు. మార్చి 25వ తేదీన కుల్‌ దీప్‌ వైద్య సహాయం నిమిత్తం జీబీటీ ఆస్పత్రికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో కుల్‌దీప్‌ గ్యాంగ్‌ పోలీసులపై కారంపొడి చల్లి కాల్పులకు తెగబడింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. కుల్‌దీప్‌ గ్యాంగ్‌లోని ఓ దుండగుడు కూడా మృతి చెందాడు.
పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు రోహిణీలోని ఓ ప్లాట్‌లో తలదాచుకున్నాడు. ఇక ఆ నేరగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడిని ట్రాక్‌ చేసి బిల్డింగ్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేయగా లెక్క చేయని కుల్‌దీప్‌ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా అతడిపై ఎదురు కాల్పులు జరపడంతో కుల్‌దీప్‌ హతమయ్యాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.