దేశంలో గడిచిన 24గంటల్లో 11.81లక్షల పరీక్షలు చేయగా 62,714 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు, దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కి చేరింది. కొత్తగా 28,739 మంది వైరస్ బారి నుంచి బయటపడడంతో మొత్తం రికవరీల సంఖ్య 1,13,23,762కు చేరుకుని రికవరీ రేటు 94.85శాతానికి పడిపోయింది. కరోనా మరణాలు 312 కావడంతో రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతూ పోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 4,86,310కి పెరిగింది.