శనివారం దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయత్నించడంతో విమానంలోని ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు వేగంగా స్పందించి అతన్ని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం వారణాసిలో సురక్షితంగా దిగిన తర్వాత ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్టు తెలిపింది. దర్యాప్తు చేసిన తర్వాత అతని మానసిక స్థితి సరిగాలేదని తెలిసినట్టుగా పోలీసులు తెలిపారు.