క్రైమ్ (Crime) వార్తలు (News)

యూపీలో ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 18 మంది దుర్మరణం!!

మంగళవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో రోడ్డు పక్కన నిలిచిఉన్న డబుల్‌ డెక్కర్‌ బస్సుపైకి ఒక ట్రక్కు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హరియాణాలోని అంబాలా నుంచి దాదాపు 130 మంది ప్రయాణికులతో ఓ డబుల్ డెక్కర్‌ బస్సు మంగళవారం బయల్దేరగా రాత్రి 8 గంటల ప్రాంతంలో లఖ్‌నవూ – అయోధ్య జాతీయ రహదారిపై బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. రిపేర్‌ అవడానికి టైం పడుతుందని డ్రైవర్‌ చెప్పడంతో వాహనంలోని కొంతమంది కిందకు దిగి నేలపై నిద్రపోయారు. మరికొంతమంది బస్సులోనే విశ్రాంతి తీసుకున్నారు. అయితే రాత్రి 11 గంటల తర్వాత లఖ్‌నవూ నుంచి వస్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై నిద్రిస్తున్న వారి మీద నుంచి వెళ్లి బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాలా మంది గాయపడ్డారు. బస్సులోని వారంతా వలస కూలీలే. హరియాణాలో పనిచేస్తున్న వీరంతా స్వస్థలానికి వెళ్లేందుకు బస్సులో బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •