వార్తలు (News)

కిశ్త్వార్‌ జిల్లాలో భారీ వర్షాలు .. 7గురి మృతి, 30 మంది గల్లంతు!!

జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్వార్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షాలు బీభత్సం సృష్టించడంతో దాదాపు 30 మంది ఆచూకీ గల్లంతయింది. అకస్మాత్తుగా వచ్చిన వరదలకు హొంజార్ గ్రామంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళం సేవలు కూడా ఉపయోగించుకోనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గత కొద్దిరోజులుగా జమ్ములో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వరదలు, కొండ చరియలు విరిగిపడే ముప్పు ఉన్న ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిశ్త్వార్‌, కార్గిల్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నట్లు, ప్రతిఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు కేంద్రమంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •