జాతీయం (National) వార్తలు (News)

స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సీఎం కూడా ఉక్కు నిరసనలో భాగస్వాములవ్వాలి!!

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇందులో భాగంగా ఇవాళ ఉక్కు పరిపాలన విభాగం గేటు ఎదుట నిరసన చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని వారు డిమాండ్‌ చేస్తూ నిర్వాసితులకు భూములు ఇవ్వాలంటూ నినదించడంతో పాటు సీఎంతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ వచ్చి కార్మికుల నిరసనలో భాగస్వాములవ్వాలన్నారు.

ప్రజాప్రతినిధులంతా కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని వారిని హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    108
    Shares
  • 108
  •  
  •  
  •  
  •