రాజకీయం (Politics) వార్తలు (News)

స్పందన కార్యక్రమం నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి!!

స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రామ, వార్డు సచివాలయాలు మెరుగుపడాలంటే వాటిని ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తుండాలని, వారానికి రెండు సార్లు కలెక్టర్లు, నాలుగుసార్లు జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు కూడా వారానికి నాలుగుసార్లు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పర్యవేక్షించాలన్నారు. తనిఖీలు చేయని అధికారులకు నోటీసులు ఇవ్వాలన్న సీఎం అటు జేసీలకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.

బియ్యంకార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవని, అవి నిర్దేశించిన సమయంలోగా అర్హులకు అందేలా చూడాలని, ఆయా పధకాలు అనర్హులకు అందకుండా చూసుకోవాలని, ఇందుకు అనుగుణంగానే అధికారులు స్వయంగా సచివాలయాలను సందర్శించి పర్యవేక్షించాలని, ఏమైనా లోపాలు ఉంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, సిబ్బందికి మెమోలు ఇవ్వడమన్నది తనకు కూడా బాధను కలిగిస్తోందని, వచ్చే స్పందనలోగా పరిస్థితుల్లో మార్పులు రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఆగష్టు 10వ తేదీన నేతన్న నేస్తం, ఆగష్టు 16న విద్యాకానుక, రూ. 20 వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగష్టు 24న డబ్బు జమ, ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగష్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని, కలెక్టర్లు ఇందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •