ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

సంపన్నులు నివసిస్తున్న ప్రాంతాల్లో వ్యాపిస్తున్న డెంగీ??

పోయిన ఏడాది బస్తీల్లో హైడ్రోక్లోరైడ్‌తో శానిటైజ్‌ చేయడం, ఫాగింగ్‌ నిర్వహించడం వల్ల దోమలు పెద్దగా లేకుండా పోయాయి. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో కోవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయా చర్యలు చేపట్టకపోవడంతో డెంగీ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ ఒకవైపు వరద, మరోవైపు బురద పేరుకు పోయింది. ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అధికారికంగా ఇప్పటికే 250 కేసులు నమోదు కాగా అనధికారికంగా ఒక్కో కార్పొరేట్‌ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్‌లింగంపల్లి, నానాక్‌రామ్‌గూడ, కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇంటి చుట్టు వరద నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయి. దీంతో నిల్వ ఉన్న ఈ నీటిగుంతల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని మరింత పెంచి పోషిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పడు దోమల నియంత్రణ కోసం యాంటిలార్వ, ఫాగింగ్‌ నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా దోమలు దాడి చేస్తుండటంతో ఇటీవల బాధితులు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.

మనిషి రక్తంలో ప్లేట్‌లెట్స్‌ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వస్తే టి సంఖ్య తగ్గుతుంది దీంతో వీరికి వెంటనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి. చికిత్సల పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేసి అత్యవసర చికిత్సల పేరుతో రోజుకు రూ.50 వేలకుపైగా చార్జీలు వేస్తుంటాయి. డెంగీ కేసుల వివరాలను ఏ రోజుకారోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేయాల్సి ఉన్నప్పటికీ నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్‌ ఆస్పత్రి కూడా ఆ సమాచారం ఇవ్వడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను సస్పెక్టెడ్‌ డెంగీ కేసుల జాబితా లో ఉంచి చికిత్సలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •