జాతీయం (National) వార్తలు (News)

వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు..!!

బుధవారం నాటి దేశీయ మార్కెట్లు వరుసగా మూడవ రోజు కూడా నష్టాలతోనే ముగిసాయి. ఉదయమే నష్టాల్లో ప్రారంభమైన సూచీలు క్రమంగా ఇంట్రాడే కనిష్ఠాలను తాకి సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్లు దిద్దుబాటుకు గురైనప్పటికీ లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 135 పాయింట్ల నష్టంతో 52,443 వద్ద ముగియగా నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 15,709 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగియగా.. ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •