వార్తలు (News) వినోదం

ఈ వారం ధియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు!!

సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు తెలంగాణాలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా మల్టీప్లెక్స్ లు, కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రారంభం కానున్నాయి. దాంతో, మొదటి వీకెండే 5 సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ ఈ నెల 30న విడుదల కానుండగా వీటితో పాటు మరో మూడు చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి.. “త్రయం”, “నరసింహపురం”, “పరిగెత్తు పరిగెత్తు” అనే మూడు సినిమాలు జులై 30నే థియేటర్లోకి వస్తాయని పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. మిగతా మూడు చిన్న సినిమాలను పక్కన పెట్టినా ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ చిత్రాలు ఎలా ఆడుతాయి అనే దానిమీద మిగిలిన సినిమాలు థియేటర్ లో విడుదల అవుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •