వార్తలు (News)

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు కార్మికుల మృతి!!

హైదరాబాద్ జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఉదయం నాసెన్స్‌ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే అవి ఫ్యాక్టరీ అంతా వ్యాపించడంతో కార్మికులు తలో దిక్కుకూ పరుగులు పెట్టారు.

అయినప్పటికీ ఇద్దరు కార్మికులు అందులో చిక్కుకుని చనిపోయారు. మరికొందరికి మంటల వల్ల తీవ్రమైన గాయాలు అయ్యాయి. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం!

పెద్ద ఎత్తున వస్తున్న మంటల్ని చూసి స్థానికులు భయభ్రఅంతులకు గురయ్యారు. కొంతసేపటికి ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చారు. బాయిలర్‌లో ఇంకా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. అందులోంచీ పొగ బాగా వస్తోంది.

అసలేం జరిగిందనే అంశంపై పరిశీలిస్తున్న అధికారులు త్వరలోనే రిపోర్ట్ ఇస్తామని అంటున్నారు. పాత పరిశ్రమలను తొలగించకుండా అలాగే కంటిన్యూ చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    275
    Shares
  • 275
  •  
  •  
  •  
  •