ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

వృద్ధాప్యం దరి చేరకూడదంటే??

మనం తినే పదార్థాలకూ, మన శరీరం, ఆరోగ్యానికీ సంబంధం ఉంటుంది. వయసు పెరగడాన్ని మనం ఆపలేము. కొంత మంది 50 ఏళ్ల నుంచే ముసలివారైతే, కొంతమందికి 80 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉంటారు. మనం వయసుని ఆపలేము కానీ వాయిదా వేయగలం! వయసులో ఉన్నప్పటి నుంచే సరైన ఆహారం తింటూ ఉంటే త్వరగా ముసలితనం రాదు. వచ్చినా అనారోగ్యాలు పెద్దగా ఉండవు. అలాంటి పరిస్థితి రావాలంటే డాక్టర్లు 5 రకాల పదార్థాల్ని తినడం మానేయాలని సలహా ఇస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తింటేతినొచ్చు గానీ… నిత్యం మనం తీసుకునే ఆహారంలో మాత్రం వాటిని భాగం చేయరాదు. అవేంటో తెలుసుకుందాం.

Pastries / Cakes: కేక్‌లు, పాస్ట్రీలు, ఫ్యాట్స్ ఇలాంటివన్నీ మన శరీరంలో కొవ్వును పెంచుతాయి. కొవ్వు పెరగడం ద్వారా ముసలి తనం అంత త్వరగా వస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి.

Cold Drinks: ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింకులు తీసుకోరాదు. వాటికి బదులు ఫ్రూట్ జ్యూస్‌లు తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాంటి డ్రింక్స్ కూడా బాడీలో నీటిని కోల్పోయేలా చేయడమే కాకుండా వీటిలోని కెఫైన్ శరీరానికి హాని చేస్తుంది. త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తుంది.

Burger-Pizza: పిజ్జాలు, బర్గర్లూ టేస్టీగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మాత్రం సర్వనాశనం చేస్తాయి. ఇవి మన చర్మంపై ఉండే కాంతిని పూర్తిగా పోగొట్టి బాడీలో పార్టులకు కొవ్వును పొరలా అతికిస్తాయి. దాంతో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అదొక్కటి చాలు చాలా రోగాలు దాడి చేసే అవకాశం రావడానికి! ఫాస్ట్ ఫుడ్ ఎంత తింటే. అంతలా ఫ్యాటీ యాసిడ్స్ పెరిగిపోయి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. వీటిని ఎంత తగ్గిస్తే అంతలా మీరు ముసలితనానికి దూరమవుతారని నిపుణులు చెబుతున్నారు.

Excess fat and salt in chips: చిప్స్ తినేవారు వాటిని ఫ్యాట్ నూనెలో వేపుతారనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. సాల్ట్ ఎక్కువగా వాడడం వల్ల అలాంటివి తింటే ఆరోగ్యం పాడైపోతుంది. ఇలాంటి ఆహారాలు మీకు తెలియకుండానే మీ బాడీలో పార్టుల్ని నాశనం చేసి ముసలితనం త్వరగా వచ్చేలా చేస్తాయి.

Smoking and drinking: మద్యం తాగడం, స్మోకింగ్ వంటివి కూడా ముసలితనానికి దారి తీస్తాయి. బాడీ త్వరగా డీహైడ్రేట్ అవ్వడం ద్వారా అది చర్మంపై ప్రభావం చూపి ముడతలు వచ్చేలా చేస్తుంది.

పైన చెప్పిన ఆహారాలకు దూరంగా ఉండడం ద్వారా ముసలి తనం కొంత వాయిదా వేసే అవకాశాలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అన్నిటికన్నా ముఖ్యమైనది మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •