అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రెజ్లర్ వినేష్ పోగాట్‌ పొరపాటు.. ఫ్లైట్ మిస్!!

ఈసారి ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో గోల్డ్ మెడల్ తెస్తుందని అంటా ఎదురు చూస్తున్న స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకుంది. కోచ్ వోలెట్ అకోస్‌తో కలిసి శిక్షణ కోసం హంగరీ వెళ్లిన ఆమె యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా అక్కడ ఉండడంతో మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకోగా తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

దీనిపై స్పందించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ వినేష్ బుధవారం టోక్యో వెళ్తుందని స్పష్టం చేసింది. వీసా గడువు సరిగా చూడకపోవడంతోనే ఈ పొరపాటు జరిగిందని, ఆమె 90 రోజుల పాటు అక్కడ ఉండాల్సి ఉండగా ఆమె ఫ్రాంక్‌ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది అని వెల్లడించింది.

ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్‌కు సమాచారాన్ని చేరవేశారు. మంగళవారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే ఉన్న వినేష్‌కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. బుధవారం టోక్యోలో ల్యాండైన తర్వాత మరోసారి ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.

రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో ఇండియాకు గోల్డ్ మెడల్ తెస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆమె టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. ఆగష్టు 5న ఒలింపిక్స్‌లో ఆమె పోటీలు ప్రారంభమవుతాయి. ఏషియన్‌, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆమె.. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో బ్రాంజ్ గెలిచింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •