జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

‘నవోదయ’లో తరగతులు పునఃప్రారంభం.. ఎప్పుడు??

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడంతో దశల వారీగా తరగతులు నిర్వహించేందుకు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. ఈ సమయంలో జవహర్‌ నవోదయ విద్యాలయ సమితి కీలక నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 31నుంచి దశల వారీగా తరగతులు పునఃప్రారంభించనున్నట్టు, తొలుత 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు 50శాతం సిటింగ్‌ సామర్థ్యంతో తరగతులు నిర్వహించనున్నట్టు, ఈ నెల 31 నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కావడంతో పాటు తల్లిదండ్రుల సమ్మతితో హాస్టళ్లలో కూడా ఉండేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌ విద్యబోధన కూడా కొనసాగుతుందని అలాగే కొవిడ్‌ నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •