వార్తలు (News)

పొలాల్లోనే అల్లం పంటను దున్నేస్తున్న రైతులు!!

ఒకప్పుడు అల్లం పంట పండించే రైతులు బాగా డబ్బు మూట కట్టుకునేవారు. గత కొద్దిరోజులుగా గిట్టుబాటు ధరలు లేక అల్లం పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో అల్లం ధర కేవలం 20 రూపాయలు మాత్రమే పలుకుతుండడంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన అల్లం పంటను పొలాల్లోనే దున్నేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో అల్లం సాగు ఎక్కువ చేస్తారు రైతులు. పండించిన అల్లం పంటకు.. కనీస పెట్టుబడి కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను దున్నేస్తున్నారు రైతులు. అల్లంకు మార్కెట్‌ లో సరైన ధర లేకపోవడం వల్ల అల్లం పంట వేసిన రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. లాభాలు వస్తాయని ఆశించి అప్పులు తెచ్చి మరీ అల్లం సాగుకు విత్తనంతో పాటు మందులు, కలుపుతీత, ఎరువులు తదితర వాటి కోసం ఎకరానికి లక్ష రూపాయల వరకు రైతులు ఖర్చు చేశారు. ప్రజెంట్ మార్కెట్‌లో మాత్రం కేవలం కిలో 20 రూపాయాలకు పడిపోయింది. దీంతో సాగు, రవాణా ఖర్చులు అన్ని కలిపినా పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్‌ డివిజన్‌లో కోహీర్‌, జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌ మండలాల్లో అధికంగా అల్లం పంటను సాగు చేస్తారు. ఇతర పంటల కంటే అల్లానికి మంచి ధర ఉంటుందనే ఆశతో అప్పులు చేసి మరీ సాగుచేసారు. చివరికీ మద్దతు ధర లేకపోవడంతో.. లబోదిబోమంటున్నారు రైతులు. అల్లం పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని జహీరాబాద్ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చిరుధాన్యాల పంటలకు ఎలాగైతే మద్దతు ధర ప్రకటిస్తుందో ఉద్యానవనశాఖ పరిధిలోకి వచ్చే అల్లం పంటకు కూడా నిర్ధిష్టమైన ధరలను ప్రకటిస్తే రైతులకు లాభం చేకూరే అవకాశం ఉందని వాపోతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •