జాతీయం (National) వార్తలు (News)

సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌ నిర్వహించనున్న రైతు సంఘాలు!!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న పోరాటాన్ని రైతు సంఘాలు మరింత ఉద్ధృతం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా సెప్టెంబర్‌ 25న భారత్‌ బంద్‌ పిలుపునిచ్చింది. దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత ఆశీష్‌ మిత్తల్‌ మాట్లాడుతూ గతేడాది కూడా ఇదే తేదీన భారత్‌ బంద్‌ నిర్వహించామని, ఈ ఏడాది పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ మరింత విజయవంతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పోరాటంలో భాగంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందన్నారు.

దిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతుల అఖిల భారత సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సదస్సుకు 22 రాష్ట్రాల నుంచి 300 రైతు సంఘాల ప్రతినిధులతో పాటు మహిళా, కార్మిక, గిరిజన, యువజన, విద్యార్థి సంఘాలు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
దేశ రాజధాని నగర సరిహద్దుల్లో గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న రైతుల పోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగంపై ఏవిధంగా దాడి చేస్తుందో సదస్సులో చర్చించినట్టు తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, విద్యుత్‌ బిల్లు 2021ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •