వార్తలు (News)

ఏపికి మూడు రోజుల పాటు భారీ వర్షాలు!!

ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నట్లు, పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 3.1 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నదని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో నేడు (28.08.2021) ఉదయంనకు వాయువ్య మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

13°N అక్షాంశము వెంబడి తూర్పు-పడమర ‘షీర్ జోన్’ సగటు సముద్ర మట్టానికి 4.5 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని, వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఈ మూడు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు కావున తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •