క్రైమ్ (Crime) వార్తలు (News)

మావోయిస్టు నేత ఎక్కింటి సీతారాంరెడ్డి లొంగుబాటు??

అనారోగ్య కారణాలతో సీనియర్‌ మావోయిస్టు నేత ఎక్కింటి సీతారాంరెడ్డి శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. నలభై ఏళ్ల క్రితం పార్టీలోకి వెళ్లిన ఆయన మధ్యలో పోలీసులకు చిక్కినా, బెయిల్‌పై విడుదలయ్యాక మళ్లీ దళంలో చేరారు. తల్లి చనిపోయి నా అంత్యక్రియలకు హాజరు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెం దిన ఎక్కింటి సీతారాంరెడ్డి బూర్గంపహాడ్‌ మండలంలో 10వ తరగతి పూర్తిచేయగా, హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ చదివి అక్కడే ఆర్‌ఎస్‌యూ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

అదే సమయంలో కొండపల్లి సీతారామయ్యను కలిసిన అనంతరం ఆయన మాటలతో పార్టీపట్ల ఆకర్షితులై పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ భద్రాచలం దళంలో సభ్యుడిగా చేరారు. 1981లో దళంలో చేరిన ఆయన 1982లో దళ కమాండర్‌ అయ్యారు. 1985లో ఆయన పోలీసులకు చిక్కగా 1988 లో బెయిల్‌పై బయటకు వచ్చారు.

1992లో మళ్లీ దళంలో చేరారు. 1999 వరకు పాములూరు దళ కమాండర్‌గా పనిచేయగా, అదే ఏడాది మందుపాతర పేలిన ఘటనలో సీతారాంరెడ్డి ఎడమ చేయి కోల్పోవడంతో పాటు చర్మవ్యాధి, ఇతర అనారోగ్య కారణాలవల్ల 2008 నుంచి పార్టీ కేడర్‌కు తరగతులు బోధిస్తున్నారు. దాదాపు 29 ఏళ్లపాటు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. సీతా రాంరెడ్డిపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ప్రభు త్వం ద్వారా అందజేస్తామని, ప్రస్తుతం తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేసినట్లు సీపీ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •