అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

కాబుల్ లో ఇటలీ విమానంపై కాల్పుల ఘటన??

కాబూల్‌ ఎయిర్‌పోర్టు నుంచి అఫ్గాన్‌ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్‌ పౌరులతో కాబూల్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్‌ జర్నలిస్ట్‌ ఒకరు తెలిపారు. పైలట్‌ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్‌ తెలిపారు. తమ సీ-130 రకం రవాణా విమానంపై కాబూల్‌లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •