క్రైమ్ (Crime) వార్తలు (News)

విషాదాంతంగా ముగిసిన చిన్నారి మిస్సింగ్ కేసు??

హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసు చివరికి విషాందాంతంగా ముగిసింది. ఆ చిన్నారి రాజేంద్రనగర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు. రాజేంద్రనగర్‌లోని జలాల్‌బాబానగర్‌కు చెందిన అబ్ధుల్ రహీ, తబుసమ్ దంపతుల రెండేళ్ల కుమారుడు నిన్న సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ బయటకు వచ్చిన క్రమంలో కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో పోలీసును ఆశ్రయించారు.

దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి బాబు ఆచూకీ కోసం గాలించిన క్రమంలో చిన్నారి మృతదేహాం చెరువు వద్ద లభించింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు అబ్దుల్ రహీమ్, తబసుమ్ కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అన్నికోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ చిన్నారిని చంపేసి చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •