ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఉద్యోగులకు వ్యాక్సిన్‌ తప్పని సరి!!

ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించినా కూడా ప్రైవేటు సంస్థలు కూడా వారివారి ఉద్యోగస్తులకు వ్యాక్సిన్‌ ఇప్పిస్తున్నాయి. మన దేశంలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానం కారణంగా ఈ వైరస్ ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేదని అంతా భావించారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న అనేక మంది వైరస్ భారిన పడ్డారు. కానీ వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోల్చితే వేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనిపించింది. వ్యాక్సిన్ వేయించుకోవడం స్వచ్ఛందమేనని ప్రభుత్వాలు చెబుతున్నా.. అందరూ తప్పనిసరిగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్లల్లో, విమానాల్లో, ఆలయాలలో ఇలా అనేక చోట్ల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికే అధికారులు అనుమతి ఇస్తున్నారు.

అనేక సంస్థలు సైతం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే విధుల్లోకి అనుమతించమని స్పష్టం చేస్తుండటంతో చాలా మంది వ్యాక్సి్‌న్‌ వేయించుకుంటున్నారు. ఇక తాజాగా ప్రముఖ డెల్టా ఎయిర్ లైన్స్ ఇలాంటి ఓ ప్రకటన చేసింది. వ్యాక్సిన్ రెండు డోసులను తప్పనిసరిగా తీసుకోవాలని తన ఉద్యోగులకు సూచించింది. ఒక వేళ ఎవరైనా ఉద్యోగులు కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోకపోతే నెలకు వేతనంలో నుంచి రూ.15,000 వసూలు చేస్తామని తెలిపింది డెల్టా ఎయిర్ లైన్స్. సెప్టెంబర్ 30 తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోకుండా ఎవరైనా ఉద్యోగి కనిపిస్తే, అతని జీతం నిలిపివేయబడుతుందని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగులంతా తప్పకుండా మాస్కు ధరించాలని తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •