వార్తలు (News)

వేల కిలోల టమాటా నేల పాలు??

దేశానికి అన్నం పెట్టే రైతులందరికీ కూడా అడుగడుగునా ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ కొన్నిసార్లు ప్రభుత్వాల నుంచి కొన్ని సార్లు ప్రకృతి నుంచి.. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పంట పండించిన తర్వాత ఇక రైతుకు నిరాశే ఎదురవుతుంది.
ముఖ్యంగా టమాటా రైతుల పరిస్థితి అయితే ఎప్పుడు ఎలా మారిపోతుందో ఊహించడం కష్టంగా ఉంది.

టమాటా లేనిదే దాదాపుగా అసలు వంటలు చేయరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలా ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన టమాటా పండించే రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. ఒక్కసారిగా టమాట ధరలు పెరిగి భారీగా డిమాండ్ ఏర్పడటంతో మురిసిపోయే టమాటా రైతులు ఒక్కోసారి టమాట ధరలు పడిపోవడంతో అయోమయంలో పడి పోవాల్సిన పరిస్థితి! ముందుకి వెళ్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్న చందంగా ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి మారింది. ప్రస్తుతం టమాటా కు ఉన్న ధరకు మార్కెట్కు తీసుకువెళ్లి అమ్ముకోలేక ఇక చివరికి కష్టపడి పండించిన పంటను వదులుకోలేక మహారాష్ట్రలో ఇటీవలే కొన్ని టన్నుల టమాటాలు రోడ్డు పక్కన పారవేసారు. ఈ సీజన్లో భారీగా వర్షాలు కురవడం వల్ల పలు జిల్లాలో టమాటా దిగుబడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో టమాట ధర పడిపోయింది. దీంతో రైతులు అయోమయంలో పడిపోయారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •