జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

హెచ్‌పీసీఎల్ 255 ఉద్యోగాలకు నోటిఫికేషన్!!

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనుబంధ సంస్థ హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్‌, ఇంజనీరింగ్, ఫైనాన్స్‌ వంటి పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ పోస్టుకు ప్రత్యేక విద్యార్హతలు ఉన్నాయి. వాటిని అనుసరించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అక్టోబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.hpclbiofuels.co.in/home.php ను చూడండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉండనుంది. పోస్టుల దరఖాస్తుకు వయపరిమితి పోస్టుల ఆధారంగా కనిష్ట వయసు 18 ఏళ్ల నుంచి గరిష్ట వయసు 57 ఏళ్ల వరకు ఉండాలి.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు మీకోసం..

మొత్త పోస్టులు : 255
దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 16, 2021
పోస్టులకు అర్హతలు పోస్టుల ఆధారంగా పదోతరగతి, ఐటీఐ, ఇంజనీరింగ్‌, బీఎస్సీ, డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్‌, విభాగాల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.hpclbiofuels.co.in/home.php. వయోపరిమితి సెప్టెంబర్ 1, 2021 వరకు 57 ఏళ్లు దాటి ఉండకూడదు. ఎంపిక విధానం. ముందుగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థి అకాడమిక్, అనుభవం ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. దరఖాస్తు విధానం: కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.hpclbiofuels.co.in/home.php ను సందర్శించి అనంతరం నోటిఫికేషన్ చదివిన తరువాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి. తప్పులు లేకుండా సరైన సమాచారంతో ఫాం నింపాలి. అవసరమైన ధ్రువపత్రాలను ప్రింట్ తీసి దరఖాస్తుతో పంపాలి.
దరఖాస్తును HPCL Biofuels Ltd., హౌస్ No. – 9, Shree Sadan. atliputra Colony, Patna – 800013 అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16, 2021.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •