జాతీయం (National) వార్తలు (News)

భారీ నష్టాల్లో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్‌ 60,285.89 పాయింట్ల వద్ద స్తబ్ధుగా ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్న సూచీ ఐరోపా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో 59,045 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోగా చివరకు అమ్మకాల మద్దతుతో కోలుకున్న సూచీ 410 పాయింట్ల నష్టం వద్ద 59,667.60 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,912-17,576 మధ్య కదలాడి చివరకు 106 పాయింట్లు నష్టపోయి 17,748 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, టైటన్‌, రిలయన్స్ షేర్లు రాణించాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •