దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,35,495 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 6,358 కొత్త కేసులు నిర్ధారించడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 293 మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,80,290 కు చేరింది. గత 24 గంటల్లో 6,450 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 75,456 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 653 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రాలవారీగా నమోదైన ఓమిక్రాన్ కేసుల సంఖ్య ..