కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన వెస్ట్ సెంట్రల్ రైల్వే, జబల్ పూర్ లో రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ లో 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి 2022 జనవరి 20 ను చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్, బ్యాడ్మింటన్ క్రీడల్లో రాణించి ఉండాలి. విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఒలింపిక్స్‌, వరల్డ్‌కప్‌, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, చాంఫియన్స్‌ ట్రోపీ, కామన్‌వెల్త్‌ చాంపియన్‌షిప్, యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొని ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ మూడు విధానాల్లో ఉంటుంది. 100 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్హతలు (10 మార్కులు) చూసి.. గేమ్‌ స్కిల్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ట్రయల్స్‌ చేస్తున్నప్పుడు కోచ్‌ అబ్జర్వేషన్‌ (40మార్కులు), సంబంధిత క్రీడలో సాధించిన విజయాలు(50 మార్కులు) ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఓసి విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://wcr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.