దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 477 పాయింట్లు పెరిగి 57,897 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఐతే 147 పాయింట్లు పెరిగి 17,233 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడింగ్‌ను ముగించాయి. జేకే టైర్స్‌, కెటా లిమిటెడ్‌, ఐడీఎఫ్‌సీఎల్‌, నిట్‌ లిమిటెడ్‌, ఐఫ్‌సీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌,అల్ట్రాటెక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు అత్యధికంగా లాభాల్లో ముగిసాయి. కామ్లిన్‌ ఫిన్‌ సైన్సెస్‌, బ్లిస్‌ జీవీసీ ఫార్మా, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజ్‌, రెస్పాన్సీవ్‌ ఇండస్ట్రీస్‌, పీవీఆర్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టపోయాయి.