నేటి దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 335 పాయింట్ల లాభంతో 57,755 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 17,182 వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో పయనిస్తున్నాయి.