పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు మిసెస్‌ ఇండియా- 9వ సీజన్‌ పోటీలు జరుగగా ఆ అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకోగా వివిధ రౌండ్ల అనంతరం12 మంది టైటిల్‌ బరిలో నిలిచారు. తాజాగా జరిగిన తుది విడత పోటీల్లో వారందరిపై గెలిచి మిసెస్‌ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు మల్లిక.