నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్తులు అందరు కలిసి మందు పంపిణీ చేయొద్దని, కాదని మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ ఆందోళనకు దిగారు.

ఆనందయ్య మెడిసిన్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఇక్కడికి రావడం కారణంగా తమకూ కరోనా సోకుతుందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్టు ఆనందయ్య అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామస్తుల ఆందోళనలతో ఆనందయ్య ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితి అదుపు చేసారు.

కానీ మందు పంపిణీకి కోర్టు అనుమతి ఉందని ఆనందయ్య పేర్కొంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు మందు కోసం చాలా మంది వస్తున్నారని, ప్రభుత్వం స్పందించి ఆందోళన చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు అనుమతులు లేవని ఆయుష్‌ శాఖ ఇప్పటికే ప్రకటించినప్పటికీ కరోనా బాధితులు తరలివస్తుండటంతో కృష్ణపట్నం వాసులకు ఇబ్బందులు తప్పడం లేదని పేర్కొంటున్నారు.