కరోనా కారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (ఆర్సీ) తదితర ద్రువపత్రాల వ్యాలిడిటీని పెంచాల్సిందిగా కేంద్ర రహదారి, రవాణా శాఖ సూచించడంతో ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికి మరో మూడు నెలలపాటు వ్యాలిడిటీ పొడిగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే జూన్‌ 30వరకు వారి ద్రువపత్రాలు చెల్లుబాటు అవుతాయి. టెస్టు డ్రైవ్‌లో కచ్చితంగా పాసైన వారికే లైసెన్సు జారీ చేయాలని రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.