మంగుళూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను మోసం చేసిన కేసులో రామ్‌సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ అరెస్టయ్యారని అధికార వర్గాల సమాచారం. రాయచూర్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్‌ పోస్టు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యయాయి. ప్రొఫెసర్ నుంచి ప్రసాద్ మొత్తం రూ .30 లక్షలు డిమాండ్ చేసారు. ఇప్పటికే అడ్వాన్సుగా రూ .17.5 లక్షలు తీసుకున్నారని పోలీసులు చెప్పారు. తాను మోసపోయినట్టు గ్రహించిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.