క్రైమ్ (Crime) వార్తలు (News)

ప్రాణాల మీదకు తెచ్చిన గుప్తనిధుల వేట

నిధుల కోసం గుళ్లను కూడా ధ్వంసం చేసిన ఘటనలను ఎన్నో చూశాం. వివరాల్లోకి వెళ్తే ముత్తయ్య అనే వ్యక్తి తిరువల్లూరు కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అతడికి ఓ మలయాళ మాంత్రికుడు వారి ఇంటి వెనుక నిధులు, నిక్షేపాలు ఉన్నాయని,తవ్వకాలు జరిపితే వాటిని సొంతం చేసుకోవచ్చని సలహా ఇవ్వడంతో ముత్తయ్య గత ఆరు నెలలుగా తన పిల్లలతో పాటు ఇతరుల సాయంతో గొయ్యి తవ్వడం ప్రారంభించి ఇప్పటికే 50 అడుగుల లోతుమేర తవ్వకాలు జరిపారు.

అయితే ఇటీవల భారీ వర్షం కురవడంతో ఆ గొయ్యి నీటితో నిండిపోవడంతో మోటారు సాయంతో అందులోని నీటిని బయటకు తోడారు. ఆ తర్వాత తవ్వకాలు కొనసాగించేందుకు సతంకుళానికి చెందిన రఘుపతి (47), నిర్మల్ గణపతి (19) ఇద్దరూ గొయ్యి లోపల విషవాయువు పీల్చడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందారు. ముత్తయ్య కుమారులు శివమలై, శివవెలన్‌ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని పాలయంకోట మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్షుద్రపూజల కోసం వినియోగించిన పుర్రెలు, ఇతర వస్తువులను వారి ఇంటి సమీపంలో పోలీసులు గుర్తించారు. మలయాళ మాంత్రికుడి కోసం కూడా అన్వేషణ కొనసాగుతుంది. ఇలాంటి వారి మాటల్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.