వార్తలు (News)

ఏపిలో 31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ఎంపీసీ విద్యార్థులు 2,60,012 మంది, బైపీసీకి చెందిన 98,462 మంది హాజరుకానున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వీరికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ పరీక్షలకు 3,58,474 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరికి 947 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. విద్యార్థులు bie.ap.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్షలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్కు లేనిదే పరీక్షా కేంద్రంలోని అనుమతి ఉండదని చెప్పారు. కరోనాతో బాధపడుతున్న వారికి వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాచ్ లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందికి ఒక సారి, మిగతా పది మందికి మరో సారి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.