క్రైమ్ (Crime) వార్తలు (News)

లారీ, రెండు బస్సులు ఢీ – 4 మంది మృతి – 30 మందికి గాయాలు

విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద డంపింగ్‌ యార్డు ఉండటంతో చెత్తను తగులబెట్టగా పొగ రహదారిని కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు దారి కనిపించని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎదురెదురుగా వచ్చిన గ్యాస్‌ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. అదే పరిస్థితిలో వైజాగ్‌ నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి బస్సును ఢీకొట్టగా నలుగురు మృతిచెందారు. రెండు బస్సుల్లోని కలిపి మరో 30 మందికి గాయాలయ్యాయి.

పొగ నిండిన పరిసరాలు ఒక కారణం అయితే వాహనాల అతి వేగం మరొక కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమిక సమాచారం. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.