అంతర్జాతీయం (International) వార్తలు (News)

పక్కకు తొలగిన ఎవర్ గివెన్

వారం రోజులుగా ఈజిప్ట్ వద్ద సూయజ్ కాలువలో ఇరుక్కుపోయి అంతర్జాతీయ నౌకావాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ ‘ఎవర్ గివెన్’ నౌక ఎట్టకేలకు మళ్లీ నీటిలో తేలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలో అడ్డంగా ఇరుక్కున్న ఈ భారీ నౌక వెనుక భాగానికి ఇనుప తాళ్లు కట్టి టగ్ బోట్లతో పక్కకు లాగడంతో వారం రోజులుగా ఆగిపోయిన ఇతర నౌకల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నౌకను అక్కడి నుంచి తరలించేందుకు తదుపరి చర్యలు చేపడుతున్నారు. అయితే, ఈ పని పూర్తి కావడానికి చాల కష్టపడవలసి వస్తుందని అధికారులు అంటున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.