జాతీయం (National) వార్తలు (News)

మార్చి 31 తరవాత పాటించవలసిన ఎస్‌ఎంఎస్‌ నిబంధనలు

బల్క్‌ ఎస్‌ఎంఎస్ లు (భారీ సంక్షిప్త సందేశాలు) పంపే సంస్థలు ఇకపై కొత్త నిబంధనలు పాటించకపోతే వినియోగదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడవచ్చని పేర్కొంటూ ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ లేఖ రాసింది. ఇప్పటికే వాణిజ్య సందేశాలు పంపేందుకు ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు ట్రాయ్‌ ప్రకటించింది. ఇప్పుడు అదే విషయాన్నీ కేంద్ర ప్రభుత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ సేవలకు సాంకేతిక సాయం అందించే నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), సిడాక్‌; సాఫ్ట్‌వేర్‌ సంస్థల సంఘం నాస్‌కామ్‌, పరిశ్రమ-వాణిజ్య సంఘాలు సీఐఐ-ఫిక్కీ-అసోచాం, టెలికాం నెట్‌వర్క్‌ సంస్థల సంఘం కోయ్‌లకు రాసిన లేఖలో వాణిజ్య సందేశాలు పంపేందుకు అమలు చేయాల్సిన నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.