క్రైమ్ (Crime) వార్తలు (News)

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య

జమ్మూకశ్మీర్‌లో బారాముల్లా జిల్లాలోని ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోపోర్‌ పురపాలక కార్యాలయం వద్ద బహిరంగ కాల్పులకు తెగబడడంతో బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (బీడీసీ) సభ్యుడు రియాజ్‌ అహ్మద్‌, ఆయన గన్‌మెన్‌ ప్రాణాలు కోల్పోగా మరో కౌన్సిలర్‌ కూడా గాయపడటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ముష్కరుల కోసం గాలింపు చేపట్టాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.