అంతర్జాతీయం (International) వార్తలు (News)

బార్టర్ సిస్టం తెరపైకి తెచ్చిన వెనిజువెలా

కరోనా విజృంభిస్తున్నందున వెనిజువెలా అధ్యక్షుడు కొత్త తరహా దౌత్యానికి తెరతీసి పాతకాలపు వస్తుమార్పిడి వ్యవస్థను తెరపైకి తెచ్చారు. తమకు టీకాలు ఇచ్చిన వారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఆదివారం ప్రకటించారు. ‘‘వెనిజువెలా వద్ద చమురు ఉంది. దాన్ని కొనేందుకు వినియోగదారులూ సిద్ధంగా ఉన్నారు. అయితే, మా ఉత్పత్తిలో కొంత భాగాన్ని టీకా పొందేందుకు వినియోగించా లనుకుంటున్నాం. టీకాలిచ్చే వారికి చమురు ఇస్తాం’’ అని మదురో ప్రకటించారు. వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ వంటి దేశాలు కూడా చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి.

ఇప్పటి వరకు వెనిజువెలాలో రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ టీకాతో పాటు చైనాలో అభివృద్ధి చేసిన మరో టీకా వినియోగానికి మాత్రమే అనుమతులు లభించినా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెనిజువెలా పెద్ద మొత్తంలో రుణపడి ఉండడంతో సంస్థ అనుమతించిన టీకాలు సైతం ఇప్పటి వరకు అక్కడికి చేరలేదు. పైగా ఇటీవలి కాలంలో కేసులు మరోసారి భారీ స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఈ కారణంగానే వెనిజువెలా పాత పద్దతిలో టీకా పొందాలని చూస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.