కరోనా ప్రారంభమై ఏడాది కావస్తున్నా ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చైనాలోని ఓ ల్యాబ్‌లో కరోనా పుట్టిందనేది అనేక మంది వాదన. కానీ దీనిని నిరూపిస్తూ ఇప్పటివరకు ఎలాంటి అధరాలు లభ్యం కాలేదు. ఇది కూడా చైనా వల్లనే అనేవారూ లేకపోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ), చైనా సంయుక్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తేల్చేందుకు ఒక అధ్యయనం చేపట్టి ఒక నివేదిక తయారు చేసారు. దీని ప్రకారం.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా కరోనా మనుషులకు సంక్రమించి ఉండొచ్చని ఈ అధ్యయనంలో తేలిందట. అంతేకాకుండా.. కరోనా వైరస్ ల్యాబ్‌లో పుట్టిందని చెప్పేందుకు అవకాశాలు చాలా తక్కువని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది.