వార్తలు (News)

ఇకపై మాస్క్ లేకుంటే రూ. 2వేలు ఫైన్ ఆరునెలల జైలు శిక్ష

జీహెచ్‌ఎంసీ పకడ్బందీగా కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. ఇక హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని కూడా సర్కారు నిషేధించింది. దీనితో పాటు షబ్‌-ఏ-బరాత్‌, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్‌ జయంతి, గుడ్‌ ప్రైడే, రంజాన్‌, తదితర పండుగల వేడుకలపైనా ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించిందన్నా విషయం పాఠకులకు విదితమే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.