ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

ప్రమాణస్వీకారం చేసిన రోజే బొమ్మై వరాల జల్లు!!

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే రైతు కుటుంబాల పిల్లలకు రూ.1000కోట్లతో ఉపకారవేతనాలు చెల్లించనున్నట్టు, వృద్ధాప్య పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.1200లకు పెంచడంతో పాటు వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ.600 నుంచి రూ.800లకు పెంచుతున్నట్టు తెలిపారు.

కర్ణాటక కొత్త కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించి తనపై విశ్వాసం ఉంచిన ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ కర్ణాటకలో సుపరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా అందిస్తానని హామీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •