అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News)

భారత కంటైనర్లను తిప్పికొట్టిన కాంబోడియా.. కారణం??

ఒక ప్రైవేట్ సంస్థ రవాణా చేసిన ఐదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేశామని, భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన మాంసం కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు కేవలం మనుషులకు మాత్రమే ఈ కరోనా మహమ్మారి సోకుతుందని మనమంతా అనుకున్నాం. కానీ.. జంతువుల్లోనూ ఈ కరోనా ప్రభావం ఉంటుందని తాజా పరిణామాలతో అర్ధమవుతుంది.

ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేసి ఇటీవల కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులను అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం దురదృష్టకరం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •