వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

కొత్త రికార్డులు నమోదు చేసిన భారత్‌×న్యూజిలాండ్‌ ఫైనల్‌??

ఐసీసీ అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రెండేళ్ల ఛాంపియన్‌షిప్‌లో అన్ని సిరీసుల్లోనూ ఎక్కువ మంది చూసిన పోరుగా రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 89 ప్రాంతాల్లో 130.6 మిలియన్ల లైవ్‌ వ్యూయర్‌షిప్‌ లభించగా, 177 మిలియన్ల వీక్షకులు భారత్‌, న్యూజిలాండ్‌ పోరును వీక్షించారు.

భారత్‌లోనే ఫైనల్‌ను అత్యధిక మంది అంటే 94.6% మంది స్టార్‌స్పోర్ట్స్‌, దూరదర్శన్‌ ద్వారా మ్యాచ్‌ చూశారు. స్థానిక భాషల్లోనూ వ్యాఖ్యానం రావడం పెరుగుదలకు దోహదపడిందని ఐసీసీ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అనురాగ్‌ దహియా అన్నారు.

న్యూజిలాండ్‌లో తక్కువ జనాభా ఉన్నా వ్యూయర్‌షిప్‌ ఆకర్షణీయగానే ఉంది. దాదాపుగా 200,000 మంది రాత్రంతా మేల్కొని లేదా వేకువ జామునే లేచి ఫైనల్‌ పోరును వీక్షించారు. బ్రిటన్‌లోని స్కై స్పోర్ట్స్‌లోనూ 2019-2021 ఛాంపియన్‌షిప్‌ మ్యాచుల్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ ఇదే కావడం విశేషం! 2015 తర్వాత రిజర్వుడే నాడు అత్యధికమంది చూసిన ఇంగ్లాండ్‌యేతర పోరూ ఇదే.

ఐసీసీ.టీవీ ఓటీటీ ద్వారా 145 ప్రాంతాల్లో అదనంగా 6,65,100 ప్రత్యక్ష వీక్షణలు లభించగా మొత్తంగా 14 మిలియన్ల వీక్షణా నిమిషాలకు ఇది సమానం. రిజర్వుడే రోజు ఐసీసీ వేదికల ద్వారా వీడియో కంటెట్‌ను 500 మిలియన్లకు పైగా చూశారు. ఐసీసీ డిజిటల్‌ అసెట్స్‌లో ఫేస్‌బుక్‌ ద్వారానే 423 మిలియన్ల వ్యూస్‌, 368 మిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి. ఐసీసీ ఇన్‌స్టా ద్వారానూ 70 మిలియన్ల వ్యక్తిగత వీక్షణలు రావడం ఐసీసీ అన్ని డిజిటల్‌ ఖాతాల ద్వారా 515 మిలియన్ల వీడియో వ్యూస్‌ రావడం రికార్డు సృష్టించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •