అంతర్జాతీయం (International) జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నాసాకు జెఫ్ బెజోస్ భారీ ఆఫర్??

అమెజాన్, బ్లూ ఆరిజిన్ బాస్ జెఫ్ బెజోస్ ఇటివలే స్పేష్ టూర్ కి వెళ్ళొచ్చాడు. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రుడి మీద తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు బంపరాఫర్ ప్రకటిస్తూ 2024లో నాసా చేపట్టనున్న చంద్రుడి ప్రయోగం ఆర్టిమస్ లో ఆస్ట్రోనాట్లు ప్రయాణించే వ్యోమనౌక (స్పేస్ క్రాఫ్ట్) తయారీ బాధ్యతలను తమకిస్తే 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.14,898 కోట్లు) డిస్కౌంట్ ఇస్తానని హామీఇచ్చారు.

బ్లూ ఆరిజిన్, డిఫెన్స్ కాంట్రాక్టర్ డైనెటిక్స్ బిడ్లను నాసా తిరస్కరించి లాక్ హీడ్ మార్టిన్, నార్త్ రాప్ గ్రమ్న్, డ్రేపర్ లతో కలిసి బ్లూ ఆరిజిన్ బిడ్ వేసింది. స్పేస్ ఎక్స్ కు ఆర్బిటాల్ ప్రయోగాల్లో ఉన్న అపార అనుభవం, సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని స్పేస్ ఎక్స్ కు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు నాసా సీనియర్ అధికారి కేథీ ల్యూడర్స్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే నాసా అధిపతి బిల్ నెల్సన్ కు జెఫ్ బెజోస్ లేఖ రాశారు.

కాంట్రాక్ట్ ను తమకు అప్పగిస్తే ప్రయోగంలో 200 కోట్ల డాలర్ల డిస్కౌంట్ ను ఇస్తామని స్పష్టం చేశారు. నిర్ణయించిన కోట్ కే ఒప్పుకొంటామని, వ్యవస్థ అభివృద్ధికి అవసరమయ్యే అదనపు ఖర్చులను తామే భరిస్తామని పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    49
    Shares
  • 49
  •  
  •  
  •  
  •