జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సశస్త్ర సీమా బల్ లో 115 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్??

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ నిరుద్యోగుల కోసం 115 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఆగష్టు 22వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

https://www.ssbrectt.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం ఇంటర్ పాసై హిందీలో 30 పదాలు ఇంగ్లీష్ లో 35 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్లను బట్టి సడలింపులు ఉంటాయి. ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 4 పే స్కేల్ ప్రకారం 25,500 రూపాయలు బేసిక్ శాలరీతో 81,100 రూపాయలు వేతనంగా లభిస్తుంది. స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్ రిజర్వ్‌డ్ అభ్యర్థులకు మాత్రం 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •