జాతీయం (National) వార్తలు (News)

ఇకపై ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండైనా సరే!!

వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏపిలో వంట గ్యాస్ ధర రూ.850లకు పైన ఉంది. సబ్సీడీ అంతంత మాత్రంగానే వినియోగదారులకు అందుతోంది. అయితే ఎల్పీజీ సిలెండర్ వినియోగదారులకు ఓ పక్క ధరల వడ్డిస్తూ కేంద్ర ప్రభుత్వం కాస్త వెసలుబాటు కల్పించనుంది.

ఇప్పటి వరకూ వంట గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దనే గ్యాస్ సిలెండర్ తీసుకునే వారు అలాంటిది ఇప్పటి నుండి వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చు. అంటే వినియోగదారుడు ఇకపై ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండైనా సిలెండర్ ఫిల్ చేయించుకోవచ్చు.

దీనిపై ఇటీవల లోక్ సభలో కొందరు సభ్యులు కేంద్ర మంత్రిని ఈ సమస్యపై ప్రశ్నించారు. ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకునే అవకాశం లేదా అని ప్రశ్నించగా దానికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ తేలీ సమాధానం ఇస్తూ ఇకపై గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకుని తమ గ్యాస్ సిలెండర్ ను తీసుకోవచ్చని సమాధానం ఇచ్చారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •