అంతర్జాతీయం (International) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏడేళ్ల చిన్నారి ప్రతిభ.. 7 గ్రహశకలాల గుర్తింపు!!

బ్రెజిల్‌ నివాసి అయిన ఏడేళ్ల నికోల్‌ ఒలివేరాను అత్యంత పిన్నవయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్తగా నాసా గుర్తించింది. పట్టుమని పదేళ్లు కూడా లేని నికోల్‌ పెద్ద పెద్ద వాళ్లకే అంతుపట్టని ఖగోళ రహస్యాలను విడమరచి చెబుతుంటే పెద్దలు ఆసక్తిగా వింటున్నారు.
నికోల్‌ ఏడు గ్రహశకలాలను కనుక్కున్నందుకుగాను నాసా సర్టిఫికెట్‌ ఇచ్చి మరీ తన గౌరవాన్ని చాటుకుంది.

ఖగోళశాస్త్రంపై అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసాలిస్తున్న నికోల్‌ కిందటేడాది ఆస్టరాయిడ్‌ హంట్‌ సిటిజన్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని 7 గ్రహ శకలాలను కనుక్కొని నాసా నుంచి సర్టిఫికెట్‌ అందుకుంది.

ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ సదస్సులలో ఉపన్యాసం ఇవ్వడానికి బ్రెజిల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ మంత్రిత్వ శాఖ నికోల్‌ను ఆహ్వానించడంతో కరోనా కారణంగా నికోల్‌ ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నింటికీ ఆన్‌లైన్‌లో హాజరవుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •